బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో చర్చకు కేంద్రంగా మారారు. కృతి సనన్ రక్షా బంధన్ యాడ్లో ధరించిన దుస్తులపై కంగనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం కొనసాగుతోంది.
ఈ క్రమంలో కంగనా గతంలో నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న సమయంలోని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లు కంగనా, కృతి సనన్ అవార్డులు అందుకున్న సమయంలో ధరించిన దుస్తులను పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు.
కృతి సనన్ దుస్తులపై వ్యాఖ్యలు చేసిన కంగనా.. ఇప్పుడు తన పాత అవార్డు వేడుక ఫొటోల కారణంగా నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.
Post Views: 1









