డీలిమిటేషన్‌పై మోదీకి ఖర్గే లేఖ

నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్, ఎన్డీఏ మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రభుత్వం ముందుకు వెళ్లే ముందు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కోరారు.

లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల సంఖ్యను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యను కూడా మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని కోరింది.

2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు లోక్‌సభలో మూడో వంతు రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ మూడో డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. డీలిమిటేషన్‌పై అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గే కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share