వైభవ్ సూర్యవంశీకి అండర్-19 జట్టులో చోటు దక్కలేదు

ఆస్ట్రేలియాతో జరగనున్న అండర్-19 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్‌కు చోటు లభించింది. అయితే ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మాత్రం అవకాశం దక్కలేదు.

వైభవ్‌ను ఫామ్ లేదా ఫిట్‌నెస్ కారణంగా ఎంపిక చేయలేదని తెలుస్తోంది. 2016లో బీసీసీఐ తీసుకొచ్చిన ప్రత్యేక నిబంధన ప్రకారం.. ఒక ఆటగాడు ఒకటి కంటే ఎక్కువ అండర్-19 ప్రపంచకప్‌లలో పాల్గొనకుండా పరిమితులు విధించారు. ఈ నిబంధనే అతడి ఎంపికకు అడ్డంకిగా మారినట్లు సమాచారం.

కేవలం 15 ఏళ్ల వయసులోనే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వైభవ్.. ఇప్పటికే తన ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఆస్ట్రేలియా సిరీస్‌కు అతడు దూరం కావడం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share