శంకర్‌–మురుగదాస్‌ క్రేజీ కాంబో.. భారీ ప్రాజెక్ట్‌కు ప్లాన్!

కోలీవుడ్ దిగ్గజ దర్శకులు ఎస్. శంకర్, ఎ.ఆర్. మురుగదాస్ తొలిసారి ఓ భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి మురుగదాస్ పవర్‌ఫుల్ కథ అందించగా, శంకర్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

సామాజిక అంశాలను బలమైన సందేశంతో కమర్షియల్‌గా చూపించడంలో ఇద్దరికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. మురుగదాస్ కథకు శంకర్ భారీ విజువల్స్, గ్రాండ్ మేకింగ్ జోడిస్తే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇద్దరు అగ్ర దర్శకులు ఒకే ప్రాజెక్ట్‌కు పనిచేయడం అరుదైన కలయిక కావడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. నటీనటులు, నిర్మాణ సంస్థ, ఇతర సాంకేతిక వివరాలపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share