శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  నీ భర్తకు అంత్యక్రియలు చేయాలంటే నా కోరిక తీర్చాల్సిందే…

ఉన్న చోట పని దొరకక బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి, ప్రమాదంలో భర్తలను కోల్పోయిన వితంతువులను ఓ దుర్మార్గుడు టార్గెట్ చేస్తున్న వైనమిది.వివరాల్లోకి వెళితే బ్రతుకుదెరువుకై గల్ఫ్ దేశానికి వలస వెళ్లి అక్కడ మృతి చెందిన అభాగ్యుల భార్యలను టార్గెట్ చేస్తున్నాడో మృగాడు. తాను టీడీపీ నాయకుడినని, గల్ఫ్ నుండి విజయవాడ వరకు తాను చెప్పినట్లుగానే నడుస్తుందని వింతతువులను బెదిరింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి.కాగా మీరు ముఖ్యమంత్రికి చెప్పినా మళ్లీ నా సహాయం కోసం రావాల్సిందేనని, దాని బదులు సాయంత్రం కాసేపు నా ఇంటికి వస్తే అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వితంతువులను బెదిరిస్తున్నాడని బాధితులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు.భర్తలను కోల్పోయి సహాయం కోసం చూసే వితంతువులు, స్వదేశానికి తిరిగి రావడానికి సహాయం కోరే మహిళలను టీడీపీ నాయకుడిగా చలామణి అవుతున్న ఒక పెద్దమనిషి వేధిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇది ఇలా ఉంటే మరో గల్ఫ్ దేశంలోనూ టీడీపీ నాయకుడిగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని అక్కడి ప్రభుత్వం 24 గంటలలో దేశ బహిష్కరణ చేసిందని,ఇక్కడ టీడీపీ నాయకుడిగా చలామణి అవుతూ తమ లాంటి ఎందరో మహిళల జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని , బాధిత మహిళలు టీడీపీ నాయకులకు ఫిర్యాదు చేస్తున్నారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు