భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
భద్రాచలం : ఆగస్ట్ 15 :
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రాచలం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ శివ నాయక్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ దుర్గా భవాని కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సున్నం రమేష్, జనరల్ సెక్రటరీ పూసాల శ్రీనివాసాచారి, జాయింట్ సెక్రటరీ టి.లలిత, ట్రెజరర్ డి.రాము, లైబ్రరీ సెక్రటరీ పగడాల కవిత, గేమ్స్ సెక్రటరీ బండి రాంప్రసాద్, కల్చరల్ సెక్రటరీ కొత్త మల్లేష్, లేడీస్ రిప్రజెంటిటివ్ ఎం తరుణి సీనియర్ న్యాయవాదులు పాపినేని కృష్ణకుమార్, ఎం.వి. రమణారావు, ఎం.వి. ప్రసాద్, గోడపర్తి నాగరాజు, పలివెల నరసింహారావు, రావి రామ్మోహన్, టీ. చైతన్య,తదితర న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంట్… బహుమతుల ప్రదానం…
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్నేహపూర్వక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. బార్ అసోసియేషన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ టోర్నమెంట్ విజయవంతంగా జరిగింది.
ఈ టోర్నమెంట్ లో విజయం సాధించిన క్రీడాకారులకు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ భద్రాచలం శివ నాయక్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.









