కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  భద్రాచలంలో పెట్రో సెగ: ‘నో స్టాక్’ బోర్డులతో వాహనదారుల ఇక్కట్లు !!

  • భద్రాచలంలో ఇంధన సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు.
  • సాధారణ పెట్రోల్ ‘నీల్’.. పవర్ పెట్రోలే దిక్కు.
  • క్యాన్లలో ఇంధన నిల్వపై సామాన్యుల ఆగ్రహం.
  • అధికారుల పర్యవేక్షణ కరువు. ఇబ్బందుల్లో రవాణా రంగం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబ్యూరో
భద్రాచలం ఏప్రిల్ 25
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. గత రెండు రోజులుగా ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా పట్టణంలోని పలు పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. ఉన్న కొద్దిపాటి స్టాక్ కోసం వాహనదారులు ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
పట్టణంలోని ప్రధాన బంకుల్లో సాధారణ పెట్రోల్ నిల్వలు నిండుకోవడంతో, యాజమాన్యాలు కేవలం ‘పవర్’ (ప్రీమియం) పెట్రోల్‌ను మాత్రమే విక్రయిస్తున్నాయి. లీటరుకు అదనంగా చెల్లించాల్సి వస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి వాహనదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. “సాధారణ పెట్రోల్ అడిగితే లేదని చెబుతున్నారు, పవర్ పెట్రోల్ పోయించుకోలేక ఇబ్బంది పడుతున్నాం” అని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డీజిల్ కొరత కారణంగా రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. లారీలు, ఇతర భారీ వాహనాలు బంకుల వద్దే నిలిచిపోయాయి. పలు చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో అంతరాష్ట్ర ప్రయాణికులు, అత్యవసర పనులపై వెళ్లే వారు మార్గమధ్యలో ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉండగా, కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా టిన్నులు, క్యాన్లలో ఇంధనాన్ని భారీగా నింపుకుపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల క్యూలో ఉన్న సామాన్యులకు ఇంధనం అందడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.

పట్టణంలో నెలకొన్న ఈ కృత్రిమ కొరతను నివారించడానికి పౌర సరఫరా అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. సరఫరాను క్రమబద్ధీకరించి, అక్రమ నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు