ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు…

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 26
టుడే 9 ప్రతినిధి.

భద్రాచలం శాంతినగర్ కాలనీ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.అనిల్ కుమార్, శ్రీమతి గీతాంజలి ఇందిరమ్మ ఇల్లులు గృహప్రవేశం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే
మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవారు లబ్ధి పొందాలని తెలిపారు. పేదలు ఇల్లు నిర్మించుకునే కల నెరవేరుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే ని లబ్ధిదారుల కుటుంబ సభ్యులు అభినందించారు.
అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నరు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు