భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 26
టుడే 9 ప్రతినిధి
భద్రాచలం జూనియర్ కళాశాల మైదానంలో మే 3 ఆదివారం నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు భద్రాచలం పట్టణంలోని కాకతీయ గ్రాండ్ హోటల్‌లో నిర్వహించిన ముఖ్య సమన్వయ సమావేశం విజయవంతంగా ముగిసింది. సమావేశంలో భాగంగా సమ్మేళనానికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం ఉత్సవ కమిటీ అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, హిందూ ధర్మ రక్షణ సమాజ ఐక్యతను బలోపేతం చేయడమే ఈ మహా సమ్మేళన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే పలు సమావేశాల ద్వారా ఏర్పాట్లను సమీక్షించామని, పోస్టర్ విడుదలతో ప్రచార కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తున్నామని పేర్కొన్నారు. సమ్మేళనాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు కృష్ణ చైతన్య శివనాగస్వామి. కుంజా ధర్మ. నాగభూషణ శాస్త్రి గోపి .ఎం.వి. సుబ్రహ్మణ్యం శ్రీధర్ జీ పాల్గొన్నారు. వీరితో పాటు హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు ఇతర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సమ్మేళన విజయానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.









