కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  సత్య నాదెళ్ల వంటి వారు ఇచ్చే విరాళాలకు లెక్కల్లేవు: కార్పొరేట్ విద్యా దోపిడీపై కవిత ఫైర్

రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు గడిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ‘ఫీజుల నియంత్రణ చట్టం’ తీసుకురావాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఫీజులు 50 నుండి 120 శాతం వరకు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని కవిత విమర్శించారు. తమిళనాడు లేదా గుజరాత్ తరహాలో ఫీజుల నియంత్రణకు శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించేలా ప్రభుత్వం తక్షణమే జీవో విడుదల చేయాలని, తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడకుండా అడ్డుకోవాలని సూచించారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) వ్యవహారంపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న ఈ స్కూల్‌లో ఫీజులను భారీగా పెంచడమే కాకుండా, అక్కడ ఉన్న 30 ఎకరాల భూమిని కొట్టేయాలని ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సత్య నాదెళ్ల వంటి ప్రముఖులు ఇచ్చే విరాళాలకు సరైన లెక్కలు లేవని, ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి వెంటనే సమీక్ష నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు