కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఐ టి డి ఏ ఆధ్వర్యంలో జన్ జాతీయ గరిమ ఉత్సవ్ కార్యక్రమం…

  • ఐ టి డి ఏ ఆధ్వర్యంలో
    జన్ జాతీయ గరిమ ఉత్సవ్
    కార్యక్రమం.
  • పాల్గొన్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 19
టుడే 9 ప్రతినిధి

పచ్చని చెట్లు- ప్రగతికి మెట్లు అన్న సూత్రాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు వారి దైనందన జీవితంలో భాగంగా పర్యావరణం పచ్చధనం పరిశుభ్రంగా ఉండాలంటే తప్పనిసరిగా పర్యావరణాన్ని కాపాడుకొనుటకు విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
మంగళవారం నాడు ఐటీడీఏ ఆవరణలో జెన్ జాతీయ గరిమ ఉత్సవ్ 2026 జన్ భాగీ దారి సబ్సే దూర్ సబ్సేపహలె కార్యక్రమం సందర్భంగా యూనిట్ అధికారులతో కలిసి వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియా పరిధిలోని 130 గిరిజన గ్రామాలలో జన్ జాతీయ గరిమ ఉత్సవ్ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలు అంగన్వాడి పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు, గ్రామపంచాయతీ బిల్డింగులలో ఈ కార్యక్రమానికి నియమించబడ్డ అధికారులు ఈ రోజు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపడతారని అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మారుమూల గిరిజన ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ఈనెల 19 నుంచి జన జాతీయ గరిమ ఉత్సవాలను ప్రారంభించి 25వ తేదీ వరకు ఆయా గ్రామాలలో గిరిజనులకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు అధికారులు తప్పనిసరిగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారని అన్నారు. దానిలో భాగంగా ఈ రోజు మనం పని చేసే కార్యాలయాలలో మనకు ప్రాణవాయువును ప్రసాదించే చెట్లను నాటి వాటిని సక్రమంగా పెంచి వాతావరణం కలుషితం కాకుండా చూడాలని అన్నారు. చెట్లను పెంచడం వలన పరిసరాలు శుభ్రంగా ఉండి మనకు ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని అందుకు ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ప్రాణవాయువు ఇచ్చే మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని, పర్యావరణ పరిరక్షణ మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుందని, మానవాళి అంతా ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు పచ్చదనంతో కళకళలాడాలని, అందుకు తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అశోక్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, పి వి టి జి అధికారి గన్య, ఎస్ డి సి ఆనంద్ కుమార్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, డి టి ఎల్ టి ఆర్ మనిధర్, ఇల్లందు ఏ టి డి ఓ భారతీదేవి ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు