*సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం.
*వర్గ పోరాటాలు, సామాజిక పోరాటాలు సాగించడమే సుందరయ్యకిచ్చే ఘన నివాళి.
*సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 19
టుడే 9 ప్రతినిధి
వర్గ పోరాటాలు సామాజిక పోరాటాలు సాగించడమే సుందరయ్యకు మనమిచ్చే ఘన నివాళి అని సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ఆదర్శ జీవి అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41 వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య తన కుటుంబం నుండి వర్గ,సామాజిక పోరాటం ప్రారంభించారని అన్నారు. మూడ ఆచారాలకు, నమ్మకాలకు వ్యతిరేకంగా కృషి చేశారని అన్నారు. బహుముఖ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పార్టీ నిర్మాణానికి కృషి చేశారని గుర్తు చేశారు. యువత విప్లవ రాజకీయాల వైపు ఆలోచించాలని ఆదర్శవంతమైన రాజకీయాలు కమ్యూనిస్టులతోనే సాధ్యమని అన్నారు. దేశంలో బిజెపి రాజకీయ కుట్రల ద్వారా, ఎలక్షన్ కమిషన్, ఈ డి, సి బి ఐ మొదలగు రాజ్యాంగ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వస్తుందని అన్నారు. కమ్యూనిస్టుల పని అయిపోలేదని మరిన్ని పోరాటాల ద్వారా ముందుకు సాగుతామని అన్నారు. బిజెపి మతోన్మాద ముప్పు నుండి దేశాన్ని కాపాడడం కోసమే తమిళనాడులో టీవీకె పార్టీకి కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారని అన్నారు. కేంద్రంలోని బిజెపి విధానాల వల్ల దేశ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతోందని బిజెపి విధానాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో ప్రజా పోరాటాలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
*సుందరయ్య స్ఫూర్తితో స్థానిక సమస్యలపై పోరాటాలు సాగించాలి.
*సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి.
రాజకీయ పోరాటంతో పాటు స్థానిక సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించడమే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు మనం ఇచ్చే ఘన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యం చెందుతుందని తక్షణమే హామీలు అమలు చేయాలని ఆయన అన్నారు. భద్రాచలం పట్టణాభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఐదు పంచాయతీలను వెంటనే భద్రాచలంలో కలపాలని కరకట్ట అభివృద్ధికి నిధులు కేటాయించాలని అందుకు ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో స్థానిక సమస్యలు పెరిగిపోయి ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించడమే సుందరయ్యకు మనమిచ్చే నివాలని అన్నారు. సభకు ముందుగా సుందరయ్య చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పూలమాలవేయగా పార్టీ సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ యలమంచి సీతారామయ్య చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, వార్డ్ మెంబర్ బండారు శరత్ బాబు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు, పి సంతోష్, కుమార్, డి సీతాలక్ష్మి వార్డు మెంబర్ ఇరప అనసూయ, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, నకిరేకంటి నాగరాజు, చుక్క మాధవరావు, యు జ్యోతి, ఎస్ అజయ్ కుమార్, జీవనజ్యోతి, ధనకొండ రాఘవయ్య, కొలగాని రమేష్,కుంజా శ్రీనివాస్, కనక శ్రీ, సండ్ర భూపేంద్ర, సీనియర్ నాయకులు ఎం వి ఎస్ నారాయణ, డివైఎఫ్ఐ నాయకులు డి సతీష్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు రవీంద్ర, డి రామకృష్ణ,కుంజా విజయ, జి ఝాన్సీ,వై పూర్ణిమ, అల్లాడి సత్యవతి కాక రమణ రాయల రాములు తదితరులు పాల్గొన్నారు.









