కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  టిఆర్ఎస్ కార్యకర్తల సమన్వయ సమావేశం….పార్టీని బలోపేతం చేయాలని పిలుపు.

 

భద్రాచలం మే 20
టుడే 9 ప్రతినిధి

స్థానిక హరిత టూరిజం హోటల్‌లో బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల మండల సమన్వయకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, ప్రతి గడప గడపకు గులాబీ సభ్యత్వం చేర్చాలని, 2028 ఎన్నికలకు కార్యకర్తలు ఇప్పటి నుంచే యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై పట్టింపు కంటే పబ్లిసిటీ స్టంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మచ్చా వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు