కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  పవన్ కళ్యాణ్ vs ప్రొఫెసర్ నాగేశ్వర్: ‘ఎవరు గొప్పోరో మీరే తేల్చుకోండి’ అంటూ నిలదీసిన హైపర్ ఆది!

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య రేగిన వ్యాఖ్యల వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పవన్ కళ్యాణ్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలను నాగేశ్వర్ ఉపసంహరించుకున్నప్పటికీ, ఆయనపై ఏపీలో నమోదైన కేసులు, అరెస్ట్ ఊహాగానాల నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై తాజాగా జనసేన నేత, సినీ నటుడు హైపర్ ఆది తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తీరును తప్పుబడుతూ, పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే ఆయన అభిమానులు, జనసైనికులు చూస్తూ ఊరుకోరని, సోషల్ మీడియా యుగంలో తిప్పికొట్టడం ఖాయమని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతుగా కొంతమంది జర్నలిస్టులు నిర్వహించిన సమావేశంలో ఆంధ్ర ప్రాంత నేతలపై జరిగిన విమర్శలను హైపర్ ఆది తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాన్ని నాగేశ్వర్ తప్పుగా ప్రస్తావించినప్పుడు.. దానికి నిరసనగా జనసైనికులు స్పందించడంలో ఎలాంటి తప్పులేదని ఆది సమర్థించారు. ఇది పాత రేడియో కాలం కాదని, సోషల్ మీడియా కాలమని నాగేశ్వర్ గుర్తుంచుకోవాలన్నారు. కేవలం ఆరోగ్యకరమైన విశ్లేషణలను మాత్రమే ప్రజలు స్వాగతిస్తారని, ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలను కాదని ఆయన హితవు పలికారు.

ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ చూపిన సంస్కారాన్ని ప్రస్తావిస్తూ హైపర్ ఆది ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తారు. “ప్రొఫెసర్ నాగేశ్వర్ అంతలా తప్పుగా మాట్లాడినా.. ఆయనపై నాకు గౌరవం ఉందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ గొప్పోడా? లేదా అంత తప్పు చేసి కూడా, ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్‌ను తిట్టిస్తున్న మీరు గొప్పోరా?” అంటూ నాగేశ్వర్‌ను నేరుగా నిలదీశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ, కేసుల పేరుతో హైదరాబాద్ వేదికగా ఏపీ నేతలను టార్గెట్ చేయడం సరికాదని, తప్పు జరిగినందు వల్లే జనసైనికులు పోలీసులకు ఫిర్యాదులు చేయాల్సి వచ్చిందని ఆది స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు