కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  జి సి సి లో సేల్స్ మేన్స్ డ్రైవర్స్ ఉద్యోగుల బదిలీలు…

 

భద్రాచలం మే 29
టుడే 9 ప్రతినిధి

గిరిజన సహకార సంస్థ హైదరాబాద్ వారి 38 జీవో ప్రకారము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, గిరిజన ప్రైమరీ కోపరేటివ్ సొసైటీ (జిసిసి) లలో పనిచేయుచున్న సేల్స్ మేన్లు, ఎం సి డబ్ల్యూ వర్కర్లు, డ్రైవర్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేయడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

శుక్రవారం నాడు ఐటీడీఏ కార్యాలయంలోని తన ఛాంబర్ లో జిసిసి అధికారులు సేల్స్ మెన్ కమిటీ సభ్యుల సమక్షంలో, జిసిసి పరిధిలోని ఐదు సొసైటీలలోని డిఆర్ డిపోలలో పనిచేయుచున్న సేల్స్ మేన్లు, ఎం సి డబ్ల్యూ వర్కర్లు, డ్రైవర్లతో కలిపి 28 మంది మంది సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 శాతం సిబ్బందికి బదిలీలు చేయవలసి ఉండగా 11 మందిని బదిలీ చేశామని, ఈ బదిలీల ప్రకయలో వికలాంగులు మెడికల్ పరంగా ముందుగా ప్రాధాన్యత ఇచ్చి కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేశామని అన్నారు. ఈ బదిలీలలో సేల్స్ మేన్ లు, ఎం సి డబ్ల్యూ వర్కర్లు, డైవర్ల కలిపి 11 మందిని కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేశామని అన్నారు. ఈ బదిలీల ప్రక్రియ ఎటువంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా సిబ్బంది కోరుకున్నచోట బదిలీలు చేయడం జరిగిందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఎంజిసిసి సమ్మయ్య, జిసిసి మేనేజర్లు లక్ష్మాజి, జయరాజ్, భూషయ్య,అకౌంటెంట్లు, ఖయ్యూం, డ్రైవర్లు, సేల్స్ మెన్లు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు