ఓటు నమోదు మీ హక్కు, మీ బాధ్యత…

  • ఓటర్ నమోదు అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేసిన… తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ.
  • ఓటు నమోదు మీ హక్కు, మీ బాధ్యత.. కడవెండి విశ్వనాథ్ గుప్తా

 

Today9News D రమేష్, మణుగూరు

 

ఓటు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు… ఉప సర్పంచ్ గాండ్ల సురేష్

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం,సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో S.I.R (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంలో భాగంగా, ఓటు నమోదు అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ కడవెండి విశ్వనాథ్ గుప్తా గారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఓటు నమోదు మీ హక్కు, మీ బాధ్యత అన్నారు…

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమితి సింగారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాండ్ల సురేష్ మాట్లాడుతు అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు నమోదు ప్రక్రియలో పాల్గొనాలని, ఓటు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని దానిని నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో BLA లు ఎస్ గణేష్ రెడ్డి, కొడెం సాంబశివరావు, జంగం కుమార్,NGO నాగుల జ్యోతి, వాసవి క్లబ్ బ్ వైస్ ప్రెసిడెంట్ గౌరీ శంకర్, కంకణాల వెంకటేశ్వర్లు అలాగే స్థానిక BLO లు పాల్గొన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు