శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న  మహబూబాబాద్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కె. మురళీమోహన్ 

 

శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న  మహబూబాబాద్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ శ్రీ కె. మురళీమోహన్ 

జడ్జిని   ఘనంగా సన్మానించిన భద్రాచలం బార్ అసోసియేషన్

భద్రాచలం: TODAY 9

శ్రీ సీతారామచంద్రస్వామి   దర్శనానికై భద్రాచలం విచ్చేసిన  మహబూబాబాద్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్  కె. మురళీమోహన్ కు భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్య దర్శనార్థం కుటుంబ సభ్యులతో  కలిసి విచ్చేసిన ఆయనను బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రముఖ న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలుసుకుని సాధరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా స్థానిక కాకతీయ గ్రాండ్ సత్రం వేదికగా ప్రత్యేక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. న్యాయవ్యవస్థలో విశేష సేవలందిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి  కె. మురళీమోహన్ ను బార్ అసోసియేషన్ తరఫున పట్టువస్త్రం, శాలువాతో సన్మానించి, శ్రీ సీతారామచంద్రస్వామి వారి   మెమొంటోను అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, హైకోర్టు న్యాయవాది పి.వి. కృష్ణమాచారి పాల్గొని, జడ్జ్ గారి దంపతులకు మరియు కుటుంబ సభ్యులకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు