లక్నవరం చెరువులో నీళ్లు నిల్.. ఎండుతున్న పంటలు.. కన్నీటిలో రైతులు…
. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ పరిస్థితిలు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రముఖ చెరువులు నీళ్లు లేక ఎండిపోతున్నాయి దీంతో సాగునీటికై చెరువులు, కుంటల పై ఆధారపడ్డ ఆధారపడ్డ రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీటి ఇక్కట్లతో పంట చేతికి వస్తుందో రాదో అనే అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. రెండు పంటలకు నీరందించే ఈ చెరువు ప్రస్తుతం నీళ్లు లేక బోసిపోయింది. దీంతో, చెరువు కింద సాగు చేసిన పంటలకు నీరందక పొలాలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.
ఎండల తీవ్రతకు మోటార్లతో నీళ్లు పెట్టినా భూమిలో తడి నిలవడం లేదు. మరోవైపు విద్యుత్ కోతలు రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయి.మూడు ఎకరాల్లో సాగు చేసిన పంటలో కనీసం ఒక్క ఎకరాన్ని కాపాడుకోవడం కూడా కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటపై పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు
Post Views: 2









