She Teams: మహిళలు, బాలికలకు షీటీం అండగా ఉంటుంది.. డీఎస్పీ పల్లె శ్రీనివాస్‌

సమాజంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులపై జరిగే అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు షీటీం అండగా ఉంటుందని డీఎస్పీ పల్లె శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఐనోల్‌ గిరిజన బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో జిల్లా షీటీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.

మహిళలను ఇంటి పక్కన ఉన్న వ్యక్తులు లేదా రోడ్డుపై వెళ్లే పోకిరీలు వేధిస్తే వెంటనే 112 నంబర్‌కు ఫోన్‌ చేయాలని డీఎస్పీ సూచించారు. విద్యార్థినులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సోషల్‌ మీడియాలో వచ్చే అపరిచిత లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్‌ చేయవద్దని హెచ్చరించారు. సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో సీసీఎస్‌ సీఐ శంకర్‌, షీటీం జిల్లా ఇన్‌చార్జి విజయలక్ష్మి, అచ్చంపేట సీఐ నాగరాజు, సిద్దాపూర్‌ ఎస్‌ఐ అంజయ్య, షీటీం బృందం సభ్యులు వెంకటయ్య, మల్లేష్‌, వెంకట్‌, జానకిరాములు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు