మణుగూరు సింగరేణి పెట్రోల్ బంక్ పునరుద్ధరించి, గ్యాస్ సరపరా 21 రోజులకు చేయాలి.
ఏఐటియూసి బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ వై రాంగోపాల్,
మణుగూరు ఏరియా జిఎం శ్రీ దుర్గం రామచంద్ర మెమోరాండం అందజేత….
Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
ఎన్నో సంవత్సరాల నుండి మణుగూరు ఏరియాలో కంపెనీ పెట్రోల్ బంక్ నుండి పెట్రోల్ కార్మికులకు, అధికారులకు
పెట్రోల్ సౌకర్యం కొనసాగుతుందని, ఆ సౌకర్యాన్ని నిలిపివేశారని అన్నారు.
కంపెనీ పెట్రోల్ బంక్ నుండి పెట్రోల్ లభ్యత కార్మికులకు మరియు అధికారులకు ఉపయోగకరంగా ఉండేదని మంచి నాణ్యతా ప్రమాణాలతో కూడిన పెట్రోలు సరఫరా నిలిపివేయడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, పెట్రోల్ సరఫరా పునరుద్ధరించాలని అన్నారు,
యాజమాన్యం యధావిధిగా పెట్రోల్ బంక్ పునరుద్ధరించి కార్మికులకు యధావిధిగా పెట్రోల్ సౌకర్యం పునరుద్ధరించాలని కోరారు.
మరియు హెచ్.పీ గ్యాస్ బుకింగ్ 45 రోజు బదులుగా 21 రోజులకే కొనసాగించాలని కోరారు.
దీనివలన కార్మికులు, కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు..
భారత్ గ్యాస్ బుకింగ్ 25 రోజులకే సరఫరా చేస్తుండగా హెచ్.పీ గ్యాస్ 45 రోజుల వరకు బుకింగ్ కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . హెచ్.పీ గ్యాస్ వినియోగదారులందరికీ భారత్ గ్యాస్ మాదిరిగానే21 రోజులకు బుకింగ్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు.
పెట్రోల్ సరఫరా,, గ్యాస్ బుకింగ్ ను కార్మికులకు కార్మికుల కుటుంబాలకు ఎంతో ముఖ్య అవసరమని దీనిపై యాజమాన్యం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమానికి వై రాంగోపాల్ తో పాటు
అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి మేకల ఈశ్వరరావు, జిఎం కమిటీ మెంబర్ ఆవుల నాగరాజు పాల్గొన్నారు.









