ఎల్కతుర్తిలో కారులో యువతి మృతదేహం కలకలం…

ఎల్కతుర్తి మండల కేంద్రంలో రెండు రోజులుగా ఒకే ప్రాంతంలో అనుమానాస్పదంగా నిలిచిన కారులో మృతదేహం బయటపడిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది .కారు నుంచి దుర్వాసన రావడంతో,స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారును పరిశీలించిన పోలీసులకు గుర్తుతెలియని యువతి మృతదేహం లభించినట్లు సమాచారం..

కాగా మృతదేహం గోదావరిఖని సెంటనరీ కాలనీకి చెందిన యువతిదిగా ప్రచారం కొనసాగుతోంది ..అయితే అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రేమ వ్యవహారం, హత్య వంటి అంశాలపై జరుగుతున్న ప్రచారానికి ఇంకా అధికారిక ధృవీకరణ లభించలేదు

కారును అద్దెకు తీసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్న సాగిస్తున్నారు.యువతి మృతికి కారణం ఏమిటి? కారులో మృతదేహం ఎలా వచ్చింది? సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి సంబంధం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తుతో అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు