తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, వివిధ సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశముంది. ఇప్పటికే పలు అంశాలపై రాజకీయంగా మాటల యుద్ధం కొనసాగుతోంది.
దీంతో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న వేళ.. అధికార పక్షం కూడా తమ విధానాలు, నిర్ణయాలను సభ వేదికగా వివరించే అవకాశం ఉంది.









