పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కేజీబీవీ) విద్యార్థినులకు హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఇంటెన్సిఫైడ్ ఐఈసీ (IEC) క్యాంపెయిన్ నిర్వహించారు. ఐసీటీసీ, సీహెచ్‌సీ కురుపాం, వైడీవో టీఐ ఎన్జీఓ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థినులకు హెచ్ఐవీ వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అలాగే సకాలంలో హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడం, కౌన్సెలింగ్ పొందడం, అందుబాటులో ఉన్న చికిత్సా సేవలను వినియోగించుకోవడం వంటి అంశాలను వివరించారు.
హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా సమాన దృష్టితో వ్యవహరించాలని విద్యార్థినులకు సూచించారు. వ్యాధిపై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా అపోహలను తొలగించవచ్చని, ఆరోగ్యంపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కార్యక్రమంలో పేర్కొన్నారు.









