తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సీఎం అమెరికా పర్యటనకు అడ్డంకులు సృష్టించిందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కిషన్ రెడ్డి అన్నారు. విదేశీ పర్యటనలకు అనుమతులు ఇవ్వడం, నిరాకరించడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేశారు.
ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. అనుమతి నిరాకరణను రాజకీయ కోణంలో చూడటం సరికాదని, వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Post Views: 16









