భద్రాచలం కోర్టు ఆవరణలో మౌలిక సదుపాయాలు కల్పించాలి….. జిల్లా జడ్జికి బార్ అసోసియేషన్ వినతి పత్రం అందజేత.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 25
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ అడిషనల్ కోర్టు ప్రాంగణంలో కక్షిదారులు, న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెషన్స్ జడ్జి జి.ప్రేమలత భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసి, కోర్టు ఆవరణలో ఉన్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా దూర ప్రాంతాల నుండి వచ్చే కక్షిదారుల సౌకర్యార్థం కోర్టు ప్రాంగణంలో
కోర్టుకు వచ్చే ప్రజల కోసం నాణ్యమైన ఆహారం, అందుబాటులో ఉండేలా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి.
అత్యవసర పత్రాల నకళ్ల కోసం బయటకు వెళ్లకుండా ప్రాంగణంలోనే జిరాక్స్ మిషన్ అందుబాటులో ఉంచాలని .
న్యాయవాదులకు, కక్షిదారులకు అవసరమైన ఇతర కార్యాలయ పనుల కోసం తగిన వసతులు కల్పించాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, కొడాలి శ్రీనివాసన్, ఉపాధ్యక్షులు సున్నం రమేష్, జనరల్ సెక్రటరీ పూసాల శ్రీనివాసాచారి, జాయింట్ సెక్రటరీ టి. లలిత, లైబ్రరీ సెక్రటరీ పగడాల కవిత, లేడీ రిప్రజెంటేటివ్ ఎం. తరుణి, మాజీ అధ్యక్షులు కోట దేవదానం, సీనియర్ న్యాయవాదులు పోకల మోహన్ కృష్ణ, ఆశ్రిత మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
వినతి పత్రంపై స్పందించిన జిల్లా జడ్జి ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు