- బండి సంజయ్ ని మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలి…….!*
- బండి భగీరథ ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి
- సిపిఐఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి.
- సిపిఐఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో
భద్రాచలం మే 15
టుడే 9 ప్రతినిధి
మైనర్ బాలికపై జరిగిన హత్యాచారం కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి. మైనర్ బాలికపై అత్యాచారం చేసి స్వేచ్ఛగా తిరుగుతున్న బండి భగీరథుని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఐ ఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి డిమాండ్ చేశారు. బండి భగీరథ విషయంలో తెలంగాణ పోలీస్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో ప్లే కార్డులతో నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో గడ్డం స్వామి మాట్లాడారు. కేంద్ర హోం సహాయ మంత్రి కుమారుడు తన కుమార్తెను సంవత్సరకాలంగా అత్యాచారం చేస్తున్నాడని ఓ తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేటి వరకు పోలీసులు సరైన స్థాయిలో స్పందించడం లేదని అన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేయటం తీవ్రమైన నేరమైనప్పటికీ బండి సంజయ్ కుమారుడికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి అధికారం చేపట్టిన నాటినుండి ఆడపిల్లలపై చిన్నారులపై దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పుడు స్వయానా కేంద్ర సహాయ హోం మంత్రి కొడుకే మైనర్ బాలికపై అత్యాచారం చేశారని అన్నారు. ఈ కేసును పక్కదోవ పట్టించేందుకు బండి సంజయ్ తనకున్న పలుకుబడిని ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇప్పటికే మీడియాను వ్యవస్థలను మేనేజ్ చేసిన బండి సంజయ్ న్యాయమూర్తులను సైతం కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. మైనర్ బాలికప్ అత్యాచార ఘటన నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సంజయ్ ఆ పదవిలో ఉంటే అది సాధ్యం కాదని గడ్డం స్వామి స్పష్టం చేశారు. మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని బండి సంజయ్ పాత్రపై కూడా విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకులు బిజెపితో ఉన్న చీకటి ఒప్పందం ఈ కేసుతో మరోసారి బట్టబయలైందని గడ్డం స్వామి అన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన తెలంగాణ మహిళా మంత్రులు స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. బండి సంజయ్ కి ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం తెలంగాణలో సాగుతుందని గడ్డం స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ బాలిక అత్యాచార ఘటనపై సిపిఐ ఎం తోపాటు అనుబంధ ప్రజా సంఘాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయని వెంటనే బండి భగీరథుని అరెస్టు చేయకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు సంతోష్ కుమార్ పట్టణ కమిటీ సభ్యులు నాదెండ్ల లీలావతి నకిరేకంటి నాగరాజు ధనకొండ రాఘవయ్య కుంజా శ్రీనివాస్ అజయ్ కుమార్ ఫిరోజ్ సీనియర్ నాయకులు ఎం వి ఎస్ నారాయణ డివైఎఫ్ఐ కార్యదర్శి సతీష్ బాబు ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవీందర్ సీనియర్ నాయకులు జె ఎల్ పి దాస్ కొర్సా రవి తదితరులు పాల్గొన్నారు.









