భద్రాచలం మే 20
టుడే 9 ప్రతినిధి
స్థానిక హరిత టూరిజం హోటల్‌లో బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల మండల సమన్వయకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, ప్రతి గడప గడపకు గులాబీ సభ్యత్వం చేర్చాలని, 2028 ఎన్నికలకు కార్యకర్తలు ఇప్పటి నుంచే యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై పట్టింపు కంటే పబ్లిసిటీ స్టంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మచ్చా వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









