- జీఎస్సార్ 220, 817 జీవోలను ఉపసంహరించుకోవాలి.
- భద్రాచలంలో కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్, భారీ బైక్ ర్యాలీ.
భద్రాచలం మే 20
టుడే 9 ప్రతినిధి
ఐఓసీడి – టీటీసీ డి ఏ పిలుపు మేరకు ఈరోజు నిర్వహించిన 24 గంటల దేశవ్యాప్త బంద్ భద్రాచలం డివిజన్‌లో విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిఎస్సార్ 220 జిఎస్సార్ 817 చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ డివిజన్ వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులను పూర్తిగా మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర వైద్య సేవలకు మాత్రం ఈ బంద్ నుండి మినహాయింపు ఇచ్చారు.
ఈ బంద్‌లో భాగంగా భద్రాచలం టూరిజం హోటల్ ప్రాంగణం నుండి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద మెడికల్ షాపుల నిర్వాహకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం, సిఐటియు నాయకులు పూర్తి సంఘీభావం ప్రకటించారు. టూరిజం హోటల్ వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీలో సిపిఎం సీనియర్ నాయకులు బాల నరసా రెడ్డి, సిఐటియు జిల్లా కన్వీనర్ ఏ జె రమేష్, సిఐటియు కన్వీనర్ బండారు శరత్ గారు పాల్గొని ప్రసంగించారు. కెమిస్ట్ల న్యాయమైన పోరాటానికి తాము అండగా ఉంటామని, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉన్న జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో భద్రాచలం పట్టణ కెమిస్ట్స్‌తో పాటు డివిజన్ పరిధిలోని దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపహాడ్ మండలాలకు చెందిన కెమిస్ట్లు, ఫార్మసిస్ట్లు మరియు అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు









