నందమూరి Vs అక్కినేని: 11 ఏళ్ల తర్వాత సంక్రాంతి బరిలో బాలయ్య, నాగ్ పోటాపోటీ

తెలుగు చిత్రసీమలో దశాబ్దాల చరిత్ర కలిగిన నందమూరి, అక్కినేని కుటుంబాల బాక్సాఫీస్ సమరం మరోసారి పునరావృతం కానుంది. గతంలో దాదాపు 10 సార్లు నేరుగా ఢీకొన్న నటవారసులు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున రాబోయే 2027 సంక్రాంతి బరిలో తలపడనున్నారు. కింగ్ నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘లాటరీ కింగ్’తో రాబోతుండగా, బాలకృష్ణ-కొరటాల శివ కాంబినేషన్ మూవీ కూడా అదే రేసులో నిలవనుంది. దీంతో టాలీవుడ్‌లో ఇప్పటి నుంచే బాక్సాఫీస్ ఫైట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావుల కాలం నుంచే ఈ సాంప్రదాయం మొదలైంది. వారిద్దరూ బాక్సాఫీస్ బరిలో ఎన్నోసార్లు పోటీపడగా, ఆ తర్వాత వారి నటవారసులుగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున కూడా అదే తీరున బాక్సాఫీస్ వార్‌ను కొనసాగిస్తూ సినీ అభిమానులను అలరిస్తున్నారు. గతంలో సంక్రాంతి రేసులో మూడుసార్లు తలపడిన ఈ ఇద్దరు హీరోలు.. మరోమారు 2027 సంక్రాంతి బరిలో ఢీకొనబోతున్నారు. ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ మాత్రమే కాకుండా, అదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబో మూవీ, అలాగే విక్టరీ వెంకటేశ్-అనిల్ రావిపూడిల చిత్రాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి.

ఇప్పటివరకు బాలకృష్ణ, నాగార్జున మధ్య దాదాపు 10 సార్లు నేరుగా బాక్సాఫీస్ పోరు సాగింది. వీరిద్దరి మధ్య మొదటి బాక్సాఫీస్ వార్ 1987 సంక్రాంతి రేసులో ప్రారంభమైంది. జనవరి 14న బాలయ్య ‘భార్గవరాముడు’, నాగ్ ‘మజ్ను’ చిత్రాలతో ఢీకొన్నారు. ఆ తర్వాత ‘కలెక్టర్ గారి అబ్బాయి’ – ‘సాహస సమ్రాట్’, ‘కిరాయి దాదా’ – ‘భానుమతి గారిoguడు’, ‘చినబాబు’ – ‘తిరగబడ్డ తెలుగుబిడ్డ’ పోటీపడ్డాయి. 1989 అక్టోబర్‌లో విడుదలైన నాగ్ ‘శివ’ ట్రెండ్ సెట్టర్‌గా నిలవగా, బాలయ్య ‘బాలగోపాలుడు’ ఓపెనింగ్స్ పరంగా దుమ్మురేపింది. 1994 ఏప్రిల్‌లో బాలయ్య జానపద చిత్రం ‘భైరవద్వీపం’, నాగ్ ‘హలో బ్రదర్’ విడుదల కాగా.. జనం రెండు చిత్రాలకూ బ్రహ్మరథం పట్టారు. ఇక చివరగా 2016 సంక్రాంతి బరిలో బాలయ్య ‘డిక్టేటర్’తో పోటీపడిన నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంతో అప్పర్ హ్యాండ్ సాధించారు. మళ్లీ 11 ఏళ్ల తర్వాత 2027 సంక్రాంతికి ఈ ఇద్దరు టాప్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలవనుండటంతో టాలీవుడ్‌లో ఇప్పటి నుంచే పండగ వాతావరణం నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు