*పేదోడి వైద్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి..*
*భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలి.
*సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలి.
*అడ్వాన్స్డ్ ట్రామా సెంటర్ ను భద్రాచలంలో ఏర్పాటు చేయాలి.
*శానిటేషన్ కార్మికులకు క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలి.
*ఏరియా హాస్పిటల్ సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో సర్వే.
భద్రాచలం మే 29
టుడే 9 ప్రతినిధి
పేదోడి వైద్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి సిబ్బందిని కేటాయించాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ ఏరియా హస్పటల్ లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం బి నర్సారెడ్డి మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో 62 మంది వైద్యులు అవసరం కాగా కేవలం 21మంది మాత్రమే ఉన్నారని అన్నారు. అంతేకాకుండా ఇతర వైద్య సిబ్బంది సైతం లేక రోగులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతిరోజు వచ్చే ఓపి పేషెంట్ల సంఖ్య సుమారు 400 వరకు ఉండగా చాలీచాలని సిబ్బందితో అంతమందికి వైద్య సేవలు అందించడం వైద్య బృందానికి కూడా సాధ్యం కావడం లేదని ఆ కారణంతోనే భద్రాచలం ప్రభుత్వ హాస్పటల్ లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రావడం లేదని నర్సారెడ్డి ఆరోపించారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న భద్రాచలం శాసనసభ్యులు స్వయాన వైద్యుడు అయినప్పటికీ ఏరియా హాస్పిటల్ లో వైద్యం అందని ద్రాక్షాల మిగిలిపోతుందని నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ సిబ్బందికి ప్రతినెల వేతనాలు అందక ఆకలితో పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో సిపిఐఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
*సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలి.
*గడ్డం స్వామి సిపిఐ ఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి.
200 పడకల హాస్పిటల్ గా ఉన్న భద్రాచలం ఏరియా హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అభివృద్ధి చేసి కావాల్సిన సిబ్బందిని నియమించాలని సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి డిమాండ్ చేశారు. భద్రాచలం నియోజవర్గం తో పాటు ఐదు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి అనునిత్యం యాక్సిడెంట్ కేసులు సైతం అధికంగా వస్తున్నాయని అత్యవసర కేసులు చూసేందుకు న్యూరో సర్జన్ వంటి ప్రత్యేక వైద్య నిపుణులు లేక పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి అడ్వాన్స్ ట్రామా సెంటర్ ను మంజూరు చేయాలని కోరారు. గతంలో అనేక అవార్డులు రివార్డులు అందుకున్న ఘనమైన చరిత్ర గల భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఈరోజు అనేక సమస్యలతో పురిటి నొప్పులు పడుతుందని స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హాస్పిటల్ కేంద్రంగా జరిగిన అనేక సంఘటనలు రాష్ట్రస్థాయిలో ఏజెన్సీలో అందుతున్న వైద్యంపై చర్చకు దారితీసిందని అన్నారు. చాలీచాలని సిబ్బందితో వైద్య సేవలు నిర్వహించడం వైద్య బృందానికి సవాల్గా మారిందని పని ఒత్తిడితో ఉన్న వైద్యులు కూడా సెలవులపై వెళ్ళిపోతున్నారని స్వామి అన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి ఈ దుస్థితి నెలకొనిందని వెంటనే పాలకులు మేలుకొని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి కావలసిన సిబ్బందిని కేటాయించడంతోపాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. శానిటేషన్ సిబ్బందికి సైతం కాంట్రాక్టర్ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇచ్చే అరకొర వేతనాలు కూడా రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్వామి ఆరోపించారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సమస్యలపై సిపిఐఎం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిందని వచ్చిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని స్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు నెంబర్ అనసూయ, సిపిఐ ఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పారిల్లి సంతోష్ కుమార్, డి. సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెండ్ల లీలావతి, ధనకొండ రాఘవయ్య, కనక శ్రీ, సీనియర్ నాయకులు డి రామకృష్ణ, పిల్ల ఎంకన్న, ఎస్ఎఫ్ఐ నాయకులు రవీంద్ర డివైఎఫ్ఐ నాయకులు సతీష్ బాబు, ఆది, పోసి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
.









