పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు త్వరగా, పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సమయంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చంద్రబాబు ఆత్మీయంగా ట్వీట్ చేశారు.
గత పదేళ్లుగా రాజకీయ పర్యటనలు, వారాహి యాత్రలు మరియు ఎన్నికల ప్రచారాల సమయంలో అభిమానుల తాకిడి వల్ల భుజాలపై తీవ్ర ఒత్తిడి పడి ఈ గాయాలయ్యాయని, పబ్లిక్ సర్వీస్ కోసం ఆ నొప్పిని భరిస్తూనే ఆయన ఇన్నాళ్లూ కొనసాగారని జనసేన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ముంబై ఆస్పత్రిలో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో కూటమి నేతలు, జనసైనికులు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









