గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశి రెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్, శ్రీరామ్‌నగర్, పంజుగుల, తుర్కలపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేసి, పూర్తయిన పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.









