Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకుంటున్న చిన్నారుల తో పాటు క్రింద కూర్చొని కొద్ది సేపు వారితో గడిపి ముచ్చటించిన సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ బాలల సదనం విద్యార్థుల వసతులతో పాటు వారి యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.. విద్యార్థులకు ఇష్టమైన ఆహారం ఏమిటో తెలుసుకొని సాయంత్రం అందించాలని అధికారులకు సూచించారు.
అనంతరం మణుగూరు శివలింగాపురం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట సందర్శించి పిల్లలకు అందుతున్న పౌష్టిక ఆహారాన్ని పరిశీలించి, అంగన్వాడి కేంద్రంలో బాలుడునీ ఎత్తుకొని ఆప్యాయంగా ముచ్చటించిన దృశ్యాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి.
అదేవిధంగా అనంతరం శివలింగాపురంలో ప్రాథమిక ఆసుపత్రిని సందర్శించిన మృనాల శ్రేష్ట. ఆస్పత్రి లో అన్ని విభాగాలను తనిఖీలు చేసిన సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మున్సిపాలిటీ కమిషనర్ మండల తాసిల్దార్ ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది









