మంగళవారం నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, వరంగల్ ఆర్డీవో సుమతో పాటు సంబంధిత అధికారులతో కలిసి రంగసాయిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణాలను ఆమె సందర్శించారు.
రేపు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో వేదిక, పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ పరిశీలనలో సీపీఓ అజిత్ రెడ్డి, డీఆర్డీఓ పీడీ నాగ పద్మజ, డీహెచ్ఎస్ఓ శ్రీనివాసరావు, వరంగల్ కిలా వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్ ఇక్బాల్‌తో పాటు అటవీ శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.









