మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పోలీస్ శాఖ సూచన…
Today9TV News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా S.P రోహిత్ రాజ్, సూచనల మేరకు, నూతనంగా వెలువడనున్న పోలీస్ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ (Free Coaching) మరియు ఉచిత వసతి (Free Residential Facility) కల్పించబడుతొందని పోలీస్ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది..
ఈ అవకాశాన్ని పొందదలచిన అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోపు మణుగూరు పోలీస్ స్టేషన్‌లో సమర్పించవలసి ఉంటుందని తెలిపింది .
అలాగే అభ్యర్థులందరికీ సెప్టెంబర్ 6వ తేదీన ప్రవేశ పరీక్ష (Entrance Test) నిర్వహించబడును.
ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత రెసిడెన్షియల్ సౌకర్యం కల్పిస్తూ, పోలీస్ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నారు
మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవలసిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ సూచించింది .









