నేపాల్ వరదల్లో హైదరాబాద్‌కు చెందిన 16 మంది గల్లంతు.. ఆచూకీ కోసం గాలింపు

నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన భారీ ఫ్లాష్‌ఫ్లడ్‌ కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ ఘటనలో పలువురు గల్లంతు కాగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన 16 మంది ఎన్‌ఆర్‌ఐలు కూడా గల్లంతైనట్లు సమాచారం. హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం అక్కడి నుంచి మానస సరోవరం యాత్రకు వెళ్లిన తెలుగు ఎన్‌ఆర్‌ఐలు నేపాల్‌లోని రసూవగధీ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో కెనడా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ సోమయాజుల సాయిప్రసాద్‌తో పాటు అమెరికా, లండన్ నుంచి వచ్చిన మరికొందరు తెలుగు ఎన్‌ఆర్‌ఐలు ఉన్నట్లు సమాచారం.

వరదల అనంతరం నేపాల్‌లో రెస్క్యూ, సెర్చ్‌, రిలీఫ్‌ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. నేపాల్ సైన్యం, భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. అయితే కొండ ప్రాంతాల్లో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినడంతో సహాయక బృందాలు బాధిత ప్రాంతాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

మరోవైపు కొత్తగా వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో నేపాల్ అధికారులు అప్రమత్తమయ్యారు. నదులు, డ్యామ్‌డ్‌ లేక్‌ల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ.. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన 16 మంది ఎన్‌ఆర్‌ఐల ఆచూకీ కోసం కూడా అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు