అక్టోబర్ 20న కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. రాయలసీమలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన ఉంది. అక్టోబర్ 21న కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశం ఉంది.
తెలంగాణలో అక్టోబర్ 20న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులకు Yellow Alert జారీ చేశారు .కాగా అక్టోబర్ 21న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం ఉండే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉంటే, అక్టోబర్ 19 ఉదయం 8:30తో ముగిసిన 24 గంటల్లో ఏపీలో వేపాడలో 4 సెం.మీ., పాడేరు, చిన్నమండెంలో చెరో 3 సెం.మీ. వర్షం కురిసింది. పోలవరం, రాపూరు, ఆత్మకూరు–నెల్లూరు, తాడిపత్రి, కోయిలకుంట్లలో చెరో 2 సెం.మీ. నమోదైంది.తెలంగాణలో వనపర్తి జిల్లా ఆత్మకూరులో 4 సెం.మీ., మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట, హన్వాడలో చెరో 1 సెం.మీ. వర్షం కురిసింది.









