హైదరాబాద్ సమీపంలో ప్రాగైతిహాసిక ఆనవాళ్లు.. మృగవాణి పార్కులో రాతి గాడులు

చిలుకూరు మృగవాణి నేషనల్ పార్క్‌లోని బండ జువ్వి వాచ్ టవర్ సమీపంలో ప్రాగైతిహాసిక కాలానికి చెందినవిగా భావిస్తున్న నాలుగు రాతి గాడులను చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ  గుర్తించారు.

ఒక్కో గాడి సుమారు అడుగు పొడవు, 2 నుంచి 4 అంగుళాల లోతుతో ఉంది. రాతి గొడ్డళ్లు వంటి పనిముట్లను పదును పెట్టేందుకు లేదా తయారు చేసేందుకు వీటిని ఉపయోగించి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది ఇలా ఉంటే ఈ ప్రాంతానికి సుమారు కిలోమీటరు దూరంలోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్ సమీపంలో మరో కీలక ఆనవాలు బయటపడింది. పాము పడగను పోలిన రాతి నిర్మాణంపై తాబేలు, జంతువులు, వేట దృశ్యాలు, బాణాలు, సరిహద్దు ఆకృతులతో కూడిన రాతి చిత్రాలు గుర్తించారు.

 

ఈ రాతి గాడులు, చిత్రాల కాలం, వాటి వెనుక ఉన్న చరిత్ర ఇంకా నిర్ధారణ కాలేదు. వీటి మూలాలు, వయసును తేల్చేందుకు తెలంగాణ పురావస్తు, మ్యూజియంల శాఖ శాస్త్రీయ సర్వే చేపట్టాలని ద్యావనపల్లి కోరారు.

రాతి పనిముట్లు, కుండల ముక్కలు, ఇతర మానవ కార్యకలాపాల ఆనవాళ్ల కోసం పరిసర ప్రాంతాల్లో పరిశోధనలు చేయాలని సూచించారు. అటవీ శాఖతో సమన్వయం చేసుకుని ఈ చారిత్రక ప్రాంతాలను గుర్తించి, రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు