ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి.అదో పెద్ద రాజకీయ కుట్రగా అభివర్ణించిన నేషనల్ మాల మహానాడు అధ్యక్షుడు. డాక్టర్ రత్నాకర్.
భద్రాచలం నవంబర్ 15: టుడే 9 ప్రతినిధి
ప్రధానమంత్రి మోడీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారని చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్ర అని నేషనల్ మాలమహానాడు అధ్యక్షుడు రత్నాకర్ విలేకరుల సమావేశంలో అన్నారు. అసలు ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనన్నారు,కాగా ఈ కుట్రకు కాంగ్రెస్ పార్టీ బీజం వేస్తే దీన్ని ప్రధాని మోడీ దేశం మొత్తం అమలుపరిచేలా చూస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో అందరికన్నా ముందుగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం చేయడం, దాన్ని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫాలో అవ్వడం, దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి ఇదంతా తెలిసే జరుగుతొందా అని అనుమానం వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అని డప్పు కొట్టుకునే రేవంత్ రెడ్డి, ఈ సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసేది కేవలం ఎంగిలి మెతుకులేనన్నారు.ఈ దేశ సంపద, ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవులు ఈ దేశ పరిశ్రమలు జడ్జెస్ నియామకాలు, పరిశ్రమల్లో అక్కర్లేదా? అనే సందేహాలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు..నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతోందని గుర్తు చేశారు, ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని అన్నారు. అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారన్నారు.ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నిస్తున్నానన్నారు, చంద్రబాబు మాల సామాజిక వర్గం పై పగ పెంచుకుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలపై తనకు ఏ విధమైన ఈర్ష ద్వేషాలు ఉన్నాయో చేసి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, మాలల హోల్సేల్ మేనమామ మాలలకు అన్యాయం జరుగుతున్న ముద్దులతో సరిపెట్టేసాడు తప్ప ఈనాటికీ స్పందించలేదని ఎద్దేవా చేశారు, ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇక చేసేదేముందని అనుకోకండి , ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనని తీవ్ర స్వరంతో మండి పడ్డారు, తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తుంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం, అన్యాయం అని చెంచా గిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. రిజర్వేషన్లు బెనిఫిట్ పొందిన మాల ఉద్యోగులు మాల జాతిని అణగతొక్కుతుంటే ఇకనైనా కళ్ళు తెరిచి బయటకు రండి తమ ఈ పోరాటానికి మద్దతు ఇవ్వండని పిలుపునిచ్చారు, తెలుగు రాష్ట్రాల్లో ఏ నాడు ఎదుర్కొనటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈరోజు ఎదుర్కొంటూ ఉందని, పూర్తిగా తెలుగు రాష్ట్రంలో తమ సామాజిక వర్గం ఉనికిని కోల్పోయామన్నారు. ఇకపై శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో, పల్లంటి రమేష్,అల్లాడి పౌల్ రాజు, బొజ్జ వెంకటేశ్వర్లు, చిట్టి రాజారత్నం, బాబు, బండి కళ్ళ రవిబాబు,బత్తుల రమేష్ , బిట్ర సాయి బాబు,బల్లెం లక్ష్మణ్, కననపర్తి రాజారావు, నెల్లి సూరిబాబు, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు









