కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  భద్రాకాలంలో ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​భద్రాచలం నవంబర్ 21
టుడే 9. ప్రతినిధి

​ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో , ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక టీఎన్జీవో కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని వాడబలిజ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా యం యల్ ఏ మాట్లాడుతూ, వాడబలిజల సమస్యలు పరిష్కరించటం తో పాటు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

భద్రాచలం నియోజకవర్గంలో వాడబలిజ మత్స్యకారులకు, యువకులకు, విద్యార్థులకు, మహిళలకు, మత్స్యకార సొసైటీ నుండి వచ్చే సంక్షేమ పథకాలతో పాటు, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వాడబలిజ కులస్థులకు చేప పిల్లల పెంపకం కోసం చెరువుల నిర్వహణకు ఏజెన్సీలో అనుమతి ఇవ్వాలని కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా వాడబలిజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, ఎల్లప్పుడూ వాడబలిజ కులస్తులకు అండగా ఉంటామని యం యల్ ఏ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. టీ యన్ జి ఓ నాయకులు డెక్క నరసింహారావు మాట్లాడుతూ, కులస్థులందరూ ఐకమత్యంతో ఉండాలని, సంఘం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొప్పుల మురళి మాట్లాడుతూ, రాష్ట్రంలో వాడబలిజ కులస్థులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఉద్యోగ ఉపాధి రంగాలలో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏజెన్సీలో వాడబలిజలు పోటీ చేసి సత్తా చాటాలని కోరారు. తమ హక్కుల కోసం నిరంతరం పోరాడాలని, తమ ఐక్యమత్యమే సంఘానికి బలం అని ఆయన ఉద్ఘాటించారు.​ఈ కార్యక్రమంలో వాడబలిజ సంఘం నాయకులు బి.రాంబాబు, అర్జున్, లక్ష్మీనారాయణ, శ్రీను, రాకేష్, రాము , నాగేంద్ర, సుందర్, శ్యామ్, ఆర్.వి రమణ, భాస్కర్, సాంబ, ఈశ్వర్, సందీప్, ప్రతాప్ , సమ్మయ్య , సాయి, నాగేశ్వరరావు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు