కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  గ్రామ పంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీ..

గ్రామ పంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీ చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.తాండూర్ నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలు పగలగొట్టి నామినేషన్ క్లస్టర్ లో ఉన్న నామినేషన్ పత్రాలను గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

ఈ పరిణామంతో ,గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండా(ఐ) గ్రామాలకు సర్పంచ్ వార్డు మెంబర్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. నామినేషన్ పత్రాలు డేటా స్కాన్ చేసి ఉంచామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు, పోలీసులు అభ్యర్థులను సముదాయించారు.మరోవైపు ఒరిజినల్ నామినేషన్ పత్రాలు లేకపోవడంతో భద్రతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు