కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు కలకలం…

కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వేస్టేషన్‌లో నల్ల సంచిలో ఉన్న నాటు బాంబును వీధి కుక్క కొరడంతో పేలుడు సంభవించి అక్కడికక్కడే కుక్క మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది

. వివరాల్లోకి వెళితే,కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో ఒక అండర్ వేర్ లో దాచి ఉన్న నాటు బాంబులను ఒకకుక్క రైల్వే స్టేషన్ లో కి ఎత్తుకు వచ్చింది. మొత్తం ఆరు నాటు బాంబుల్లో ఒకటి కొరికగా, అది పేలడం తో కుక్క అక్కడి కక్కడే మృతి చెందింది. మరో అయిదు బాంబులు పేలకుండా మిగిలాయి. హఠాత్ సంఘటనతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టగా, పోలీసులు కేసు నమోదు చేసి డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు ప్రారంభించారు. పేలకుండా మిగిలిన నాటు బాంబులను జి అర్ పి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని. స్టేషన్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ సందర్శించారు. కాగా అడవి పందుల కోసం పంట చేలల్లో పెట్టే నాటు బాంబులుగా భావిస్తున్నారు.సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా సంచి ఉంచిన ఆగంతకుడి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు….

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు