కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఐ టి డి ఏ ఆధ్వర్యంలో ఘనంగా బి ఆర్ అంబేద్కర్ జయంతి.

పాల్గొన్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో భద్రాచలం; ఏప్రిల్ 14 :టుడే 9 ప్రతినిధి

భారత రాజ్యాంగ రూపశిల్పి, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, భారతీయులకు పరిచయం అవసరం లేని పేరు అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం భారతీయుల గుండెల్లో పదిలంగా ఉంటుందని, ఆయన ఎవరో కాదు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అన్నారు.
మంగళవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఐటీడీఏ యూనిట్ అధికారుల సమక్షంలో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, దళితులు, మహిళలు, కార్మికుల, కర్షకుల, అణగారిన వర్గాల హక్కుల కోసం సామాజిక ,ఆర్థిక, సాధికారత కోసం జీవితాంతం తపించి ఆలు పెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని, దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు, తదితర వర్గాలకు సమన్వయం జరిగేలా అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖం నేటికి అగ్ర జ్వాలలు పేళ్ళు బూకుతునే ఉందని ,దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం, ఆలు పెరగని పోరాటం చేసిన మహనీయుడని, దళితుల పట్ల నాడు ఉన్న వివక్షల రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని ఆయన అన్నారు.

కులాలు అనేది మనం సృష్టించుకున్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా అంబేద్కర్ ఆశయాలు ఎవరు మార్చలేరని, బడుగు బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగ కూడదనే ఉద్దేశంతో వారికి కచ్చితమైన సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు భరోసాని, భవిష్యత్తు ఇచ్చేలా తన ఆరోగ్యం ను లెక్కచేయకుండా భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి రూపొందించిన మార్గదర్శకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, చదువే మనిషికి మూడో నేత్రమని ఆయన పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని గిరిజన ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు ఆయన చూపిన మార్గంలో నడవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అశోక్, ఆర్.సి.ఓ గురుకులం అరుణకుమారి, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, పివిటీజి అధికారి గన్యా నాయక్, ఏపీఓ పవర్ వేణు, డీఎం జీసిసి సమ్మయ్య, ఏ సీఎంవో రమేష్, ఏ డి ఎం హెచ్ ఓ సైదులు, ఏవో సున్నం రాంబాబు, డీఎస్ఓ ప్రభాకర్ రావు,మేనేజర్ ఆదినారాయణ, జయరాజ్ మరియు పర్యవేక్షకులు ఐటీడీఏ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు