కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు హెల్ప్ లైన్ ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్…

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో
భద్రాచలం ఏప్రిల్ 21
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ అన్నారు.
మంగళవారం నాడు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ విద్య కోసం దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఈ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయని అన్నారు.
మొదటి దశ:-రిజిస్ట్రేషన్ మే 7 వరకు (ఫీజు రూ.200), వెబ్ ఆప్షన్ మే 30 వరకు సీట్ కేటాయింపు జూన్ 14
రెండవ దశ:-రిజిస్ట్రేషన్ మే 15 నుండి మే 30 వరకు (రూ.400).

మూడవ దశ:-రిజిస్ట్రేషన్ మే 31 నుండి జూన్ 20 వరకు (ఫీజు రూ.400)
మొదటి దశలో విద్యార్థులు నమోదు చేసుకొని వెబ్ ఆప్షన్ ఇవ్వాలని, సీట్లు మెరిట్ ఆధారంగా కేటాయిస్తారని, రెండు, మూడు దశల్లో ఖాళీ ఉన్న సీట్లను భర్తీ చేస్తారని ఆయన అన్నారు.

ఒక విద్యార్థి గరిష్టంగా 60 కళాశాలలకు వెబ్ ఆప్షన్ ఇవ్వవచ్చునని, ఎంపికైన కళాశాలలో ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి సీటును నిర్ధారించుకోవాలని, పైన పేర్కొన్న అడ్మిషన్స్ ప్రక్రియలో సాంకేతిక ఇతర సమస్యలు పరిష్కరించుటకు మా కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని, అడ్మిషన్ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా (రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా) ఈ సహాయ కేంద్రంలో చేయటం జరుగుతుందని అన్నారు.

ప్రభుత్వ కళాశాలలో ఉచిత విద్య, నోట్ పుస్తకాలు, వసతి వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కలవని అన్నారు.
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వయం ప్రతిపత్తితో పాటు ఆధునిక సౌకర్యాలు, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతి గదులు, ఆర్థికంగా బలహీన వర్గాల వారికి స్కాలర్షిప్, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, ఈ కళాశాలలో చేరిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని ఆయన అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు