కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  చర్ల, దుమ్ముగూడెంకు 23 బోర్లు మంజూరు….. ఎంపీ వద్దిరాజు నిధుల కేటాయింపు.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో
భద్రాచలం ఏప్రిల్ 22
టుడే 9 ప్రతినిధి

ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని గిరిజన గూడెల్లో నీటి ఎద్దడి సమస్యకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పరిష్కారం చూపారు. తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడి గిరిజనులకు చేతిపంపుల ద్వారా మంచినీటిని అందజేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు ఎంపీ రవిచంద్ర స్పందించి తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో రెండు మండలాల్లో 23 మంచినీటి బోర్లు మంజూరు చేశారు. వీటిలో దుమ్ముగూడెం లో 15, చర్లలో 8 బోర్లు ఉన్నాయి. ఈ మేరకు బోర్ల నిర్మాణానికి అయ్యే రూ.35 లక్షలు విడుదల చేశారు. ఎండాకాలం తీవ్రత దృష్ట్యా సత్వరమే బోర్ల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. తాము అడిగిన వెంటనే బోర్లు మంజూరుతో పాటు నిధులు విడుదల చేసినందుకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణలు కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు