కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అవగాహన సదస్సు…….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో
భద్రాచలం ఏప్రిల్ 24
టుడే 9 ప్రతినిధి

నిరుద్యోగులైన గిరిజన యువతీ యువకులు పై స్థాయి వరకు చదువుకొని ఇంటిపట్టునే ఉండి ఖాళీగా ఉండకుండా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకొని జీవనోపాధికి వెసులుబాటు కల్పించుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శుక్రవారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని వైటీసీలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి యువతి, యువకులు చెడు భావాలను మనసులో నుండి తీసేసి మార్పు చెంది వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకొని ముందుకు పోతున్న దేశాలలో చైనా జపాన్ దక్షిణ కొరియా రాష్ట్రాలు ముందుకు పోతున్నాయని, ప్రపంచ దేశాలకు పోటీపడి మనం కూడా ముందుకు పోవాలని, పీజీ, బీటెక్, చేసిన యువతీ, యువకులు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించుకొని వివిధ ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ జీవనోపాధి కల్పించుకుంటున్నారని, ప్రభుత్వ ఉద్యోగం అనేది ఈ పోటీ ప్రపంచంలో సాధించాలంటే ఎంతో శ్రమించాలని, అందుకు ప్రతి ఒక్కరు ఐటీడీఏ భవిత సెల్లు ద్వారా నిర్వహించే వివిధ రకాల వృత్తి శిక్షణలో తర్ఫీదు పొంది శిక్షణ తీసుకొని స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొంది ఆర్థిక వెసులు బాటు కల్పించుకోవాలని ఆయన అన్నారు. వివిధ కోర్సులలో చేరడానికి అవగాహనకు వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని దానిని సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పొందాలని ఆయన అన్నారు. ఈసారి గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే శిక్షణ ఇప్పించడం జరుగుతుందని, శిక్షణ తీసుకునే గిరిజన యువతి యువకులు వీరికి శిక్షణానంతరం ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తామని ఒప్పంద పత్రం రాసి ఇచ్చిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. పలు కోర్సులలో శిక్షణ తీసుకోవడానికి 170 మంది యువతీ యువకులు పాల్గొన్నారని, ఐటి హెల్ప్ డెస్క్ అటెండెంట్ కోర్సు కు 45 మంది, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సు కు 8 మంది, ఎంబ్రాయిడరి మిషన్ ఆపరేటర్ కోర్సుకు 20 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు 35 మంది, టైలరింగ్ మిషన్ ఆపరేటర్ కోర్సుకు 52 మంది, మిగతా కోర్సులకు పదిమంది శిక్షణ తీసుకోవడానికి ముందుకు వచ్చారని అందుకు ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.ఈ శిక్షణ మూడు నుండి ఆరు నెలల పాటు ఉంటుందని, ఈ తీసుకుంటున్న యువతీ యువకులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నందున తప్పనిసరిగా గిరిజన యువతి యువకులు మీకు నచ్చిన కోర్సులలో శ్రద్ధగా శిక్షణ తీసుకొని స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి కల్పించు కోవాలని ఆయన అన్నారు. అంతకుముందు భద్రాచలం సర్పంచ్ వివిధ కోర్సులలో శిక్షణ తీసుకోవడానికి వచ్చిన గిరిజన యువతి యువకులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, ఏవో సున్నం రాంబాబు, జేడీఎం హరికృష్ణ, వై టి సి సెంటర్ ఇన్చార్జి శ్రీను, భవిత సెల్ సిబ్బంది సమ్మయ్య, మణిదీప్, దీన కుమారి, అనురాధ, అభిరామ్ . గిరిజన యువతి యువకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు