15 ఏళ్ల తర్వాత వెండితెరపైకి సమీరా రెడ్డి రీఎంట్రీ.. సంజయ్ దత్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్!

టాలీవుడ్‌లో ‘జై చిరంజీవ’, ‘అశోక్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరై, తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ సమీరా రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై మెరవనుంది. 2014లో వివాహం చేసుకున్న తర్వాత తన కుటుంబ బాధ్యతల కోసం సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. బాలీవుడ్‌లో ఒక కీలక ప్రాజెక్టు ద్వారా ఆమె మళ్లీ కెమెరా ముందుకు రాబోతుండటం అభిమానులకు సంతోషాన్ని ఇస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆఖ్రీ సవాల్’ చిత్రం ద్వారా సమీరా రెడ్డి తన సెకండ్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుడుతోంది. జాతీయ అవార్డు గ్రహీత అభిజీత్ మోహన్ వారంగ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆమె ఒక అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. తన రీఎంట్రీ గురించి స్పందించిన సమీరా.. ఇకపై రొటీన్ కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న, అర్థవంతమైన పాత్రలనే ఎంచుకుంటానని స్పష్టం చేసింది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ప్రయాణం నేపథ్యంలో అత్యంత ఆసక్తికరంగా ఈ ‘ఆఖ్రీ సవాల్’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఒక ప్రొఫెసర్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు నమాశి చక్రవర్తి ఒక విద్యార్థి పాత్రలో కనిపించనున్నాడు. ఇందిరా గాంధీ హత్య తర్వాతి పరిణామాలు, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి భారత రాజకీయాల్లోని కీలక చారిత్రక ఘట్టాలను ఇందులో ప్రధానంగా చూపించనున్నారు. ఈ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు