ప్రముఖ కథానాయకి త్రిష కృష్ణన్ సోమవారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేయగా, ఆలయం వెలుపల అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలను త్రిష స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
అయితే, ఈ పర్యటన కేవలం పుట్టినరోజు వేడుకల కోసమేనా లేక రాజకీయ కారణాల వల్లనా అన్న చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. ఆలయం వెలుపల ఒక అభిమాని ‘రిజల్ట్ పక్కా మనదే మేడమ్’ అని అరవగా, త్రిష నవ్వుతూ స్పందించడం వైరల్‌గా మారింది. నేడు తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో, తన సన్నిహితుడు మరియు నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ విజయం కోసమే ఆమె తిరుమలకు వచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గత కొంతకాలంగా విజయ్, త్రిషల మధ్య రిలేషన్ గురించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ రంగప్రవేశానికి మద్దతుగా త్రిష ఇప్పటికే సోషల్ మీడియాలో పరోక్షంగా పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. నేడు వెలువడనున్న తమిళనాడు అసెంబ్లీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో త్రిష తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.









