కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  కోర్రాజుల స్వామి జాతర వాల్ పోస్టర్లు ఆవిష్కరణ… పాల్గొన్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 5
టుడే 9 ప్రతినిధి.

రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే బాల కోర్రాజుల స్వామి నాయకపోడు తెగ ఇలవేల్పుల జాతరను చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు.
మంగళవారం నాడు తన ఛాంబర్ లో భద్రాచలం అశోక్ నగర్ కొత్త కాలనీలో జరిగే బాల కుర్రాజుల స్వామి వారి జాతర వాల్ పోస్టర్లను నాయకపోడు బాల కోర్రాజుల స్వామి వారి ఉత్సవ కమిటీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయక పోడు తెగ వంశస్థులు వారి ఇలవేల్పులు అయినా బాల కుర్రాజుల స్వామి కటాక్షం వలన వారి కుటుంబాలు అందరూ క్షేమంగా ఉండటానికి పాడిపంటలు సమృద్ధిగా పండడానికి ప్రత్యేకంగా ఆదివాసి నాయకపోడు ఆరాధ్య దైవమైన బాల కుర్రాజుల స్వామిని ఈనెల ఏడవ తేదీ నుండి 15వ తేదీ వరకు వారం రోజులపాటు పూజలు చేసి 15వ తారీకు చివరి రోజు పెద్ద ఎత్తున అగ్నిగుండం ప్రవేశంతో సంబరాలు ముగిస్తారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయక్ పోడ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెల్లం రమణయ్య, పుల్లయ్య, మారయ్య, పూజారి కొండయ్య, లక్క రామకృష్ణ, పాశం భరత్, జమ్మల శ్రీను, ముర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు