కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఓడినా కుర్చీ వదలని మమతా బెనర్జీ: ‘బయటకు గెంటేయండి’ అంటూ సీనియర్ లాయర్ మహేష్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైనప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని మమతా బెనర్జీ భీష్మించుకోవడాన్ని సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సంఘం ఫలితాలను అధికారికంగా ప్రకటించిన మరుక్షణమే పాత ముఖ్యమంత్రి పదవి రద్దవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవించకుండా ఇంకా సీఎం కుర్చీలో కూర్చోవాలనుకోవడం అక్రమ చొరబాటు కిందకే వస్తుందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అని ఆయన మండిపడ్డారు.

మమతా బెనర్జీ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోకపోతే గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి ఆమెను బర్తరఫ్ చేయాలని జెఠ్మలానీ సూచించారు. ఒకవేళ ఆమె మొండికేస్తే పోలీసులను పంపి మరీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బయటకు గెంటేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 స్థానాలను దొంగిలించారంటూ ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే కోర్టులకు వెళ్లి నిరూపించుకోవాలని, అంతేకానీ ఇలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు.

మరోవైపు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా మమత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ఎవరి సొంత ఇష్టాయిష్టాల ప్రకారం నడవదని, నిర్ణీత సమయం ముగిసిన తర్వాత గవర్నర్ కచ్చితంగా చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. బెంగాల్ అసెంబ్లీ పదవీ కాలం మే 7తో ముగియనుండటంతో, మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు